భాషాభిమానులు తెలుగు ఘనతను మరింత పెంచుకోవాలని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కోరారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సినీనటుడు అప్పాజీ అంబరీష రూపొందించిన... వేటూరి, సిరివెన్నెల తెలుగు యూనికోడ్ ఫాంట్స్ను సిరివెన్నెల లాంఛనంగా ఆవిష్కరించారు.
రచయితగా అర్హత సంపాదించడానికి కారణమైన తన గురువు వేటూరి పేరుతో తెలుగు ఫాంట్స్ తయారు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్న సిరివెన్నెల... తెలుగు ఫాంట్స్ ఎంత ఎక్కువగా వినియోగిస్తే తెలుగు భాష అంత అందంగా తయారవుతుందన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా యూనికోడ్లో 30కిపైగా తెలుగు ఫాంట్స్ తయారు చేసిన నటుడు అంబరీషను అభినందించారు. ఆంగ్లంతో పోటీపడేలా 100కుపైగా తెలుగు ఫాంట్స్ తయారు చేయాలని, ఇందుకు తనతోపాటు భాషాభిమానులంతా అంబరీష్కు సహకరిస్తామన్నారు.
ఇదీ చూడండి: సీఎన్ఆర్ బయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ