ETV Bharat / city

ఆర్టీసీ సమ్మెపై విచారణ పదికి వాయిదా...

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిల్​పై వాదనలు ముగిసాయి. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు వెల్లడించింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

ts rtc strike
author img

By

Published : Oct 6, 2019, 12:22 PM IST

Updated : Oct 6, 2019, 7:51 PM IST

ఆర్టీసీ సమ్మెపై విచారణ పదికి వాయిదా...

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వాదనలు ముగిసాయి. సమ్మె విరమించేలా ఆర్టీసీ సంఘాలను ఆదేశించాలని ఓయూ రీసెర్చ్​ స్కాలర్​ సురేంద్రసింగ్​ దాఖలు చేసిన పిల్​పై న్యాయస్థానం విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు వెల్లడించింది. రెండు గుర్తింపు సంఘాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వెంటనే సమ్మె ఆపాలి: పిటిషనర్​ తరఫు న్యాయవాది

సమ్మెతో ప్రజలు పడుతున్న ఇక్కట్లు కోర్టు దృష్టికి తెచ్చామని పిటిషనర్​ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం కమిటీ వేయాలని కోరామని వెల్లడించారు. నివేదిక ఆధారంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని... వెంటనే సమ్మె ఆపేలా చూడాలని కోర్టుకు నివేదించామని పేర్కొన్నారు.

సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలి: అడ్వకేట్​ జనరల్​

సమ్మెను విరమించాలని పిటిషనర్ కోర్టును కోరారని అడ్వకేట్​ జనరల్​ బీఎస్​ ప్రసాద్​ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం కోర్టుకు తెలిపామన్నారు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని..కార్మికుల ఆందోళనతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని కోర్టుకు తెలిపామని ఏజీ అన్నారు. ఆర్టీసీ రోజూ నడిపే బస్సుల కంటే అదనంగా వెయ్యి వాహనాలు సమకూర్చామని తెలిపారు.

ఇదీ చూడండి: ఆర్టీసీపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్

Last Updated : Oct 6, 2019, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.