ETV Bharat / city

రోజూ ‘బయోమెట్రిక్‌’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టాయి. కళాశాలల్లో పనిచేసి వెళ్లిన వారికి కాలేజీ కన్సల్టెన్సీలు ఫోన్లు చేస్తున్నాయి. రోజూ ‘బయోమెట్రిక్‌’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు ఇస్తామని చెబుతున్నారు. ఈ తరహా ఫోన్‌ రికార్డెడ్‌ వాయిస్‌లు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.

bio metric
bio metric
author img

By

Published : Jul 5, 2022, 7:59 AM IST

తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం(2022-23) అనుబంధ గుర్తింపు పొందేందుకు ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉత్తుత్తి అధ్యాపకుల కోసం మళ్లీ వేట కొనసాగిస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి రప్పించే బాధ్యతను కొన్ని కాలేజీలు కన్సల్టెన్సీలకు అప్పగించాయి. దాంతో కన్సల్టెన్సీల సిబ్బంది కళాశాలల్లో పనిచేసి, మానేసి ఇతర వృత్తుల్లోకి వెళ్లిన వారికి ఫోన్లు చేస్తున్నాయి. ఈ తరహా ఫోన్‌ రికార్డెడ్‌ వాయిస్‌లు కూడా సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.

రోజూ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్‌ హాజరు వేసి వెళితే నెలకు రూ.15 వేలు ఇస్తామని, జేఎన్‌టీయూహెచ్‌ తనిఖీల నాడు వస్తే(రెండు సార్లు) రూ.20 వేలు ముట్టజెపుతామని అధ్యాపకులకు ఫోన్లు చేస్తున్నారు. బాచుపల్లిలోని ఓ కళాశాలలో, జేఎన్‌టీయూహెచ్‌ సమీపంలోని మరో కాలేజీలో ప్రస్తుతం ఇలాంటి అవకాశం ఉందని కన్సల్టెన్సీల సిబ్బంది చెప్పడం గమనార్హం.

ఇవీ చదవండి : జేఈఈ మెయిన్​లో.. హైదరాబాద్ విద్యార్థికి 300/300 మార్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.