ETV Bharat / city

పండగ పూట.. సామాన్యులకు వంటగ్యాస్​ ధరల మంట

పెట్రో ధరల పెరుగుదలకు ఇప్పట్లో అవకాశాలున్నట్లు కనిపించట్లేదు. రోజు రోజుకు పైపైకి పోతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితి కనూచూపుమేరలో ఉన్నట్లు లేదు. తాజాగా దసరా పండుగ ముందు వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి.

author img

By

Published : Oct 13, 2021, 3:10 PM IST

petro
petro

పెట్రో ధరల పెరుగుదలకు ఇప్పట్లో అవకాశాలున్నట్లు కనిపించట్లేదు. రోజు రోజుకు పైపైకి పోతున్నాయే తప్ప.. తగ్గే పరిస్థితి కనూచూపుమేరలో ఉన్నట్లు లేదు. పెట్రోల్, డీజల్ ధరల మోతతో ఇప్పటికే సామాన్యుల నడ్డి విరుగుతుంటే.. ఏకంగా గ్యాస్ బండతో మోదుతున్నాయి ఆయిల్ కంపెనీలు. దసరా పండుగ ముందు వంట గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెంచేశారు.

14.2 కేజీల సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.15 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేశాయి. గ్యాస్ సిలిండర్ వాడే వారిపై తీవ్ర ప్రభావం పడింది. హైదరాబాద్​లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.937కు చేరింది. దిల్లీలో సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు రూ.899.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.911 నుంచి రూ.926కి, ముంబైలో రూ.844.50 నుండి రూ.899.50కి పెరిగింది. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50.

దిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ ధర రూ.1736.5. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1805.5. ముంబైలో రూ.1685, చెన్నైలో రూ.1867.50గా ఉంది. సహజ వాయువు ధరల పెరుగుదల కారణంగా సీఎన్జీ, జీఎన్జీ వంట గ్యాస్ ధరలు పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో సిఎన్‌జి ధరను కిలోకు రూ.2.55 వరకు పెంచింది. అదే సమయంలో పీఎన్జీ ద్వారా ధర క్యూబిక్ మీటర్‌కు రూ.2.10 పెరిగింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ తక్షణం అమలులోకి వచ్చేలా సీన్జీజీ, పీఎన్జీ రిటైల్ ధరను కిలోకు రూ.2 పెంచింది. ఇప్పుడు ముంబైలో అన్ని పన్నులతో కలిపి సీఎన్జీ కేజీకి రూ.54.57గా ఉంది.

ఇదీ చదవండి : 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.