కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో తెలంగాణ సర్కార్.. తమ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్-(ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణ పనులు చేస్తున్నారంటూ... తుమ్మలపల్లి శ్రీనివాస్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
పర్యావరణ అనుమతులు లేకుండా కాళేశ్వరం విస్తరణ పనులు చేపట్టొద్దని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. ఆ ఆదేశాలకు విరుద్ధంగా విస్తరణ పనులు చేపడితే.. కేంద్ర జలశక్తిశాఖకు ఫిర్యాదు చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ పిటిషనర్‌కు సూచించింది. ఇప్పటికే ఈ కేసులో ఇవ్వాల్సిన ఆదేశాలు ఇచ్చేశామన్న ఎన్జీటీ.. కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.
- ఇదీ చూడండి : పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు