భాజపా సీనియర్ నేత పేరాల శేఖర్ రావును కేంద్ర ప్రభుత్వం జాతీయ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు సభ్యులుగా నియమించింది. దీనిపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన పేరాల శేఖర్ రావుకు జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న పేరాల శేఖర్ రావు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రధాని మోదీకి సన్నిహితుడైన పేరాల... గతంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.