విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్‌తోపాటు పలువురు నాయకుల అరెస్టు, ప్రజాస్వామ్యానికి విరుద్దమని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తంచేసే హక్కు ప్రతి పౌరునికి ఉందన్నారు.
పరీక్షల నిర్వహణ అంశం కోర్టులో ఉండగా.. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకు పూనుకోవడాన్ని తప్పుపట్టారు. ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతోందని, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేవని, కరోనా బాధితులను పైవేటు ఆస్పత్రులు అవస్థలు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకట్‌తో సహా ఏ ఒక్కరిపైనా ఎలాంటి కేసులు పెట్టకుండా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్ఎస్యూఐ నాయకుల అరెస్టును భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఎన్ఎస్యూఐ విద్యార్థులు ప్రగతిభవన్‌ను ముట్టడించారని తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని లేకుంటే తామే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: కాంగ్రెస్ నేతలు భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబులను అడ్డుకున్న పోలీసులు