ETV Bharat / city

దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తాం: ఉత్తమ్​ - hyderabad latest news

గజ్వేల్​లో నర్సింహులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్లనే అతను బలవన్మరణానికి పాల్పడినట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్​ నియోజకవర్గంలోనే దళితుల భూమిని లాక్కుంటారా అని.. మండిపడ్డారు. ఇటీవల దాడులకు గురైన పది దళిత కుటుంబాలతో.. ఇందిరాభవన్​లో కాంగ్రెస్ ​నేతలు సమావేశమయ్యారు.

uttam on kcr
దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తాం: ఉత్తమ్​
author img

By

Published : Oct 11, 2020, 4:53 PM IST

రాష్ట్రంలో ఇటీవల దాడులకు గురైన దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ స్పష్టం చేశారు. పది బాధిత దళిత కుటుంబాలతో.. ఇందిరాభవన్​లో ఉత్తమ్​, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​, మాజీ ఎంపీ మల్లు రవి సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని కాంగ్రెస్​ నేతలు హామీ ఇచ్చారు.

దళిత కుటుంబాల తరఫున న్యాయపోరాటం చేస్తాం: ఉత్తమ్​

గజ్వేల్​లోని భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్లనే నర్సింహులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఉత్తమ్​ ఆరోపించారు. ఆ జిల్లా కలెక్టర్​ వెంకట్రామిరెడ్డితో మాట్లాడిని ఉత్తమ్​.. నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే దళితుల భూమి లాక్కుంటారా....అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్​ ఉత్తమ్​.

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఉత్తమ్​కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారు. భూపాలపల్లి మండలం మల్లరంలో దళిత యువకుడు రావెలి రాజబాబును కొట్టి చంపారని ఉత్తమ్​ ఆరోపించారు. మల్లరం గ్రామానికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎస్సీ కమిషన్​ కూడా దోషులకు వంతపాడుతోందని విమర్శించారు.

ఇవీచూడండి: నర్సింలు కుటుంబానికి కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.