ETV Bharat / city

'నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం'

Pawankalyan comments: ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ అన్నారు. అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే 'కౌలురైతు భరోసా యాత్ర' చేపట్టామని తెలిపారు. వైకాపా నేతలు తనపై చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం' అని బదులిచ్చారు.

Pawankalyan comments on ysrcp leaders
Pawankalyan comments on ysrcp leaders
author img

By

Published : Apr 12, 2022, 6:56 PM IST

'నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం'

Pawankalyan comments: అన్నం పెట్టే రైతుకు అండగా ఉండాలనే 'కౌలురైతు భరోసా యాత్ర' చేపట్టామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో యాత్ర ప్రారంభించిన పవన్.. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్య సుజాతకు రూ.లక్ష ఆర్థికసాయం చెక్కును అందజేశారు. తన భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయమూ అందలేదని.. ఎవరూ పట్టించుకోలేదని పవన్‌ వద్ద సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని పవన్‌ ఆమెకు హామీ ఇచ్చారు. పరామర్శల అనంతరం సాయంత్రం మన్నీల గ్రామంలో పవన్‌ రచ్చబండ నిర్వహించారు.

అంతకు ముందు మీడియాతో మాట్లాడిన పవన్.. తాను పరామర్శకు వచ్చానని తెలిసి ప్రభుత్వం హడావుడిగా రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.7 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని తెలిపారు. వైకాపా పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పోరాటం చేస్తుందన్నారు.

వైకాపా నేతలపై నిప్పులు చెరిగిన పవన్ తనను సీబీఎన్ దత్తపుత్రుడంటే..జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటామని అన్నారు. జనసేనను తెదేపా బి-టీమ్ అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్ టీమ్ అంటామన్నారు. వైకాపా నేతలు దేశం కోసం కాదు.. ఆర్థిక నేరాలు చేసి జైలుకెళ్లారని ఆరోపించారు. వైకాపా వాళ్లకంటే ఎక్కువ తిట్లు తనకూ వచ్చునని దుయ్యబట్టారు.

"నన్ను సీబీఎన్ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటాం. జనసేనను తెదేపా బి-టీమ్ అంటే.. వైకాపాను చర్లపల్లి షటిల్ టీమ్ అంటాం. వైకాపా నేతలు దేశం కోసం కాదు.. ఆర్థిక నేరాలు చేసి జైలుకెళ్లారు. వైకాపా వాళ్లకంటే ఎక్కువ తిట్లు నాకూ వచ్చు. 16 నెలలు జైల్లో కూర్చుని వచ్చిన మీరా నీతులు చెప్పేది."- పవన్‌, జనసేన అధినేత

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.