Passengers Traveling In RTC Bus With Umbrellas: వర్షంలోనో, ఎండలోనో గొడుగు వేసుకుని వెళ్లడం చూస్తుంటాం. కానీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు గొడుగు వేసుకుని వెళ్లడం ఎప్పుడైనా చూశారా. ఇలాంటి అనుభవమే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ నుంచి సాలూరు వెళ్తున్న.. అల్ట్రా డీలక్స్ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు చూడాల్సింది వచ్చింది. ఆదివారం రాత్రి జోరుగా వర్షం కురవడంతో బస్సు టాప్ నుంచి నీరు ధారల్లా కారింది.
గొడుగులు తెచ్చుకున్న కొందరు ప్రయాణికులు బస్సులోనూ వాటిని వేసుకుని ప్రయాణించారు. గొడుకులు తెచ్చుకోని వారు మాత్రం బస్సులో తడుస్తూనే ప్రయాణించాల్సి వచ్చిందని వారు అసహనం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: ఏ ఊరికెళ్లినా నీరాజనాలే.. మునుగోడు కాంగ్రెస్‌దే: పాల్వాయి స్రవంతి
'ధరణి పుత్రుడు' ములాయం మృతి పట్ల ప్రముఖుల సంతాపం- మోదీ భావోద్వేగం!