ETV Bharat / city

రైలెప్పుడొస్తుందో.. విపరీత ఆలస్యంపై ప్రయాణికుల అసహనం.. - passengers are impatient due to Delay in Train Timings

Delay in Train Timings : రైల్వేశాఖ ప్రయాణికుల రైళ్లు పక్కకు మళ్లీస్తోంది. లాభసాటి అయిన సరకు రవాణా రైళ్లకే ప్రాధాన్యమిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు కార్యాలయాలకు, ఆసుపత్రులకు సకాలంలో చేరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీత ఆలస్యంపై ప్రయాణికులు ట్వీట్ల రూపంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Delay in Train Timings
train
author img

By

Published : Jul 21, 2022, 6:50 AM IST

Delay in Train Timings : రైల్వేశాఖ ప్రయాణికుల కన్నా లాభసాటి అయిన సరకు రవాణా రైళ్లకే ప్రాధాన్యమిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు కార్యాలయాలకు, ఆసుపత్రులకు సకాలంలో చేరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్లీ నుంచి వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌ కొద్దిరోజుల కిందట వరంగల్‌కు నాలుగ్గంటలు ఆలస్యంగా వచ్చింది. విపరీత ఆలస్యంపై ప్రయాణికులు ట్వీట్ల రూపంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతి తప్పిన సమయపాలన.. కొవిడ్‌ ముందుతో పోలిస్తే ప్రస్తుతం నడిచే రైళ్ల సంఖ్య తక్కువే. అనేక ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. ప్రత్యేక రైళ్లు తగ్గినా.. సమయపాలన గతి తప్పింది. బొగ్గు రవాణా రైళ్ల నిరాటంక ప్రయాణానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. గూడ్సులు వేగం పెంచడం, పార్సిల్‌ రైళ్లకు ప్రత్యేక టైమ్‌టేబుల్‌ ఇవ్వడంతో ప్రయాణికుల రైళ్లపై ప్రభావం పడుతోంది. నోయిడా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు.., అనంతపురం జిల్లా నుంచి అస్సాం, దిల్లీలకు కార్లను గూడ్సులో రవాణా చేస్తున్నారు. ట్రాక్‌ల నిర్వహణ, కొత్త నిర్మాణపనులు, పట్టాలు, స్లీపర్లు, కంకర వేయడం, ఈదురు గాలులకు వైర్లు తెగిపడటం, జోన్ల మధ్య ఆధిపత్య జగడం రైళ్ల ఆలస్యానికి కారణమవుతున్నాయి. ప్రధాన స్టేషన్లలో రైళ్ల రాకపోకల్ని సోమ, మంగళవారాల్లో ‘ఈనాడు’ పరిశీలించగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడైంది.

26 రైళ్లలో ఒక్కటే సమయానికి.. ఖమ్మం నుంచి దిల్లీ, సికింద్రాబాద్‌, విజయవాడ వైపు వెళ్లే 26 రైళ్ల రాకపోకల సమయాల్ని మంగళవారం పరిశీలించగా.. హైదరాబాద్‌-విజయవాడ ఇంటర్‌సిటీ మాత్రమే సమయానికి 11.39కి వచ్చింది. సంగమిత్ర.. అర్ధరాత్రి 00.59కి బదులు తెల్లవారుజామున 3.52కి, గాంధీధాం.. 2.12కిగాను 4.19కి, శాతవాహన 7.38కిగాను 8.25కి, కృష్ణా 10.19కిగాను 12.08కి చేరుకుంది. భావనగర్‌ 12.40కిగాను 13.30కి, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 14.10కి బదులుగా 14.40కి, హజ్రత్‌ నిజాముద్దీన్‌ రాజధాని 11.30కిగాను 12.10కి వచ్చింది.

పెరిగిన బొగ్గు, ఇతర సరకు రవాణా.. తెలంగాణలో సింగరేణి పరిధిలోని రామగుండం, కొత్తగూడెంలలో.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో రైళ్లలో బొగ్గు లోడింగ్‌ జరుగుతుంది. ఏపీలో విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, కమలాపురం దగ్గర ముద్దనూరు దగ్గర బొగ్గు అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు ఏపీలోని విశాఖపట్నం, ఒడిశాలోని పారాదీప్‌ పోర్టుల నుంచి గూడ్సుల్లో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా రవాణా అవుతోంది. ఈ క్రమంలో బొగ్గు రైళ్లను ప్రాధాన్యంతో పంపిస్తున్నారు. 2022లో రికార్డుస్థాయిలో 11.71 మిలియన్‌ టన్నుల సరకు రవాణాతో రూ.1,067.57 కోట్ల ఆదాయం వచ్చింది.

* రేణిగుంట నుంచి సికింద్రాబాద్‌ మీదుగా వెళ్లే ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ దిల్లీకి చేరేందుకు 36 గంటల 45 నిమిషాలు సమయం పడుతుంది. అదే రేణిగుంట నుంచి దిల్లీకి పాలను తీసుకెళ్లే దూద్‌ దురంతో గూడ్సు 30 గంటల్లోనే అక్కడికి చేరుకుంటోంది.

* సోమవారం సాయంత్రం అయిదింటికి హైదరాబాద్‌ రావాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రాత్రి 7.57కి చేరింది. 3 గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. అదేరోజు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరాల్సిన దురంతో ఏసీ ఎక్స్‌ప్రెస్‌ 1.40 గంటలు ఆలస్యంగా 3.50కి చేరుకుంది. ఇతర రైళ్ల కంటే దురంతోలో అధిక ఛార్జీలుంటాయి. అయినా సమయానికి రాలేదు. విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి రాత్రి 7.40కి బదులు 8.45కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.