హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరుచూరి రఘుబాబు స్మారక 29వ అఖిల భారత నాటక పోటీలు- 2019 ఘనంగా ముగిశాయి. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.
'నాటకాలకు ఆదరణ తగ్గుతోంది'
సాంఘిక నాటకాలకు ప్రేక్షకుల ఆదరణ తగ్గుతుందని ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ శివకుమార్ అన్నారు. ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, సినీ రచయితలు పోసాని కృష్ణమురళి, చిన్నికృష్ణ, పరుచూరి బ్రదర్స్, సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఇందులో నాటిక, నాటకాల విభాగాల నుంచి ఉత్తమ, ద్వితీయ, తృతీయ ప్రదర్శనలతో పాటు ఉత్తమ నటీనటులు, సహాయ నటులు, ప్రతినాయిక, ఉత్తమ రచయిత, ఉత్తమ సంగీతం, ఉత్తమ దర్శకులు, ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించారు.
ఇదీ చదవండిః 'సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్ని ఉల్లఘించారు'