మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఆదివారం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి నివాళి అర్పించారు. పీవీ నరసింహారావు పరిపాలనా దక్షుడిగా, తెలుగు ప్రజలు గర్వంచదగ్గ వ్యక్తని కొనియాడారు.
దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి సేవలు ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. అలాంటి మహనీయుడు జన్మించి వందేళ్లవుతున్న సందర్భంగా పీవీకి హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి సమర్పిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: శతజయంతి వేడుకలకు రంగం సిద్ధం.. రేపే కార్యక్రమాల ప్రకటన