ETV Bharat / city

'హాస్టళ్ల మూసివేత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి' - ఓయూ విద్యార్థుల రాస్తారోకో

హైదరాబాద్​లోని ఓయూలో లేడీస్​హాస్టల్​లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. వసతిగృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉన్నత విద్య నాశనమవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ou students protest at ladies hostel against hostels closing

author img

By

Published : Mar 25, 2021, 7:05 AM IST

హైదరాబాద్​ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లేడీస్ హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వసతిగృహాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించారు. పబ్​లు, బార్లు, మెట్రో రైళ్లు నడుస్తున్నప్పుడు... కేవలం విద్యావ్యవస్థలు మూసివేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉన్నత విద్య నాశనమవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆన్​లైన్ క్లాసులు, ఆఫ్​లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఓయూలో మూసివేసిన హాస్టళ్లను వెంటనే తెరిపించాలని కోరారు. విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఎన్​సీసీ గేటు వద్ద 200 మందితో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తోన్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: ప్రతి నీటి చుక్కా సద్వినియోగం కావాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.