ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విలియమ్ హర్ట్ (71) కన్నుమూశారు. ఈ మేరకు విలియం కుమారుడు తన తండ్రి మరణాన్ని అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. 'మా నాన్న 72వ పుట్టినరోజుకు వారం రోజుల ముందు (మార్చి13) మరణించారు. మా కుటుంబం విషాదంలో ఉందిప్పుడు'అని తెలిపాడు. ది బిగ్ చిల్, ఎ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ వంటి సినిమాల్లో విలియమ్ హర్ట్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు.
విలియమ్ హర్ట్‌కు 2018లో ప్రొస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే హర్ట్.. క్యాన్సర్ వ్యాధి కారణంగా చనిపోయారా? లేదా అనారోగ్య సమస్యలతో మరణించారా? అనేది స్పష్టత లేదు. 1991లో 'అంటిల్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్' సినిమాలో ఆయన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. 1985లో వచ్చిన 'కిస్ ఆఫ్ ద స్పైడర్ వుమెన్' సినిమాలో స్వలింగ సంపర్క ఖైదీ పాత్రలో నటించి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
ఇదీ చూడండి: ట్యాక్స్ ఫ్రీ.. ఉద్యోగులకు లీవ్.. టాప్ రేటింగ్స్.. 'కశ్మీర్ ఫైల్స్' ఎందుకింత స్పెషల్?