ETV Bharat / city

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు... విపక్షాల మద్దతు..!

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు విపక్షాలు బాసటగా నిలుస్తున్నాయి. ప్రతి జిల్లాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు పలుపార్టీల నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు... కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని వాటిని పరిష్కరించాలని కోరుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు... విపక్షాల మద్దతు..!
author img

By

Published : Oct 10, 2019, 5:17 AM IST

Updated : Oct 10, 2019, 6:51 AM IST

ఆర్టీసీ కార్మికుల ఆందోళనలకు విపక్ష నేతలు సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు. చట్టబద్దంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం అక్రమమని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ కుంతియా ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 50వేల మంది ఉద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు... విపక్షాల మద్దతు..!

కేసీఆర్​ ఎందుకు స్పందించరు..?

ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రాష్ట్ర ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్​ ఎందుకు స్పందించడంలేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ నిలదీశారు. ప్రతి అంశంపై ట్విటర్‌లో స్పందించే కేటీఆర్.... ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎందుకు ట్వీట్‌ చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే స్పందించకపోతే... రాష్ట్ర ప్రజల దృష్టిలో ద్రోహిగా మిగులుతారన్నారు.

తెరాస పతనం మొదలైంది బండి జోస్యం

ఆర్టీసీ కార్మికుల సమ్మె రాబోయే తరాలకు స్ఫూర్తి దాయకమని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. తెరాస పతనం కాబోతోందని జోస్యం చేప్పారు. సిద్దిపేటలో కార్మికుల సమ్మెకు సంజయ్‌ మద్దతు తెలిపారు. న్యాయమైన కోరికల కోసం నోటీసు ఇచ్చి... కార్మికులు సమ్మె చేస్తున్నారని ఎంపీ అన్నారు.

ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

ఆర్టీసీ కార్మికులు జిల్లాల్లో చేపట్టే నిరసనలకు స్థానికంగా వివిధ పార్టీల నేతలు మద్దతు పలుకుతున్నారు. కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఉన్నతోద్యోగులారా.. సమ్మెలోకి రండి: ఆర్టీసీ కార్మికులు

Intro:Body:Conclusion:
Last Updated : Oct 10, 2019, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.