ETV Bharat / city

ఆలయానికి వెళ్లకుండానే పూజలు... ఆన్​లైన్​లో ఆర్జిత సేవలు - తెలంగాణ ఆలయాల వార్తలు

లాక్‌డౌన్ ముగిసేవరకు ఆలయాలకు వెళ్లకుండా ఆన్‌లైన్​లో అర్చన‌, పూజా సేవ‌ల‌ను నిర్వహించుకోవాలని దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం ఆల‌యాల్లో ఆన్​లైన్​లో ఆర్జిత సేవలకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

online pooja in telangana temples
తెలంగాణ ఆలయాల్లో ఆన్​లైన్​లో ఆర్జిత సేవలు
author img

By

Published : Jun 2, 2021, 10:39 AM IST

రాష్ట్రంలోని 38 ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్‌ పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అనిల్ కుమార్ వివరించారు. టీ ఫొలియో యాప్, మీ సేవ పోర్టల్​లో ఆన్​లైన్​ పూజలను బుక్​ చేసుకోవాలని సూచించారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు హనుమాన్‌, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, బాసర జ్ఞాన సరస్వతి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సహా పలు దేవాలయాల్లో ఆన్​లైన్​ పూజలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్​ తెలిపారు.

ఆలయానికి నేరుగా వెళ్లి ద‌ర్శనం చేసుకోలేని భ‌క్తుల సౌకర్యార్థం ఆన్​లైన్​లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొనే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. లాక్​డౌన్​ సమయంలో భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇవీచూడండి: Krishnapatnam: ఆన్​లైన్​లో ఆనందయ్య మెడిసిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.