- తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ registration.telangana.gov.in క్లిక్ చేయగానే నాన్ అగ్రికల్చర్ అని వస్తుంది. దానిపై చేస్తే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
- స్లాట్ బుకింగ్ ఇన్ఫర్మేషన్ అనే దానిపై క్లిక్ చేస్తే ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్ అనే సూచికలు కన్పిస్తాయి.
- వాటిల్లో దరఖాస్తుదారుకు అవసరమైనదానిపై క్లిక్ చేస్తే ఏమేమి వివరాలు కావాలో అక్కడ కనిపిస్తుంది.
- స్లాట్ బుక్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి వివరాలు, బుక్ చేసుకున్న స్టాట్ సమయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వివరాలతో పాటు అక్కడ ఇచ్చిన లింక్ ద్వారా ఏయే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌కు తీసుకురావాలి అనే వివరాలుంటాయి.
- నిర్దేశించిన సమయానికి డాక్యుమెంట్లతో విక్రయదారు, కొనుగోలుదారు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ఇదే వెబ్ సైట్లో ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) అందుబాటులో ఉంటుంది. నిషేధిత ఆస్తుల వివరాలు అందుబాటులో ఉన్న స్లాట్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధి వంటి వివరాలు కూడా ఉంటాయి.
- బిల్డర్, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు రిజిస్ట్రేషన్ కోసం registration.telangana.gov.in వెబ్ సైట్లో ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవకాశం కల్పించారు.
మీసేవలో స్లాట్ బుకింగ్‌కు రూ.200
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రూ.200 చెల్లించి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్లాట్ బుకింగ్ మొదటి రోజు శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకూ 37 రిజిస్ట్రేన్లకు స్లాట్ బుక్ చేసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
పెద్ద సంఖ్యలో (బల్క్‌గా) రిజిస్ట్రేషనకు వీలుగా బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ప్రత్యేక విండో ఏర్పాటు చేయగా, మొదటి రోజు 451 మంది బిల్డర్లు 93,874 ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం భారీగా స్లాట్ బుకింగ్‌లు