రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అత్యంత సురక్షితంగా ఉంచేందుకు నూతన పద్దతులు అవలంబించబోతోందని జీఎంఆర్ విమానాశ్రయ సీఈవో ఎస్జీకే కిషోర్ తెలిపారు. సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు... వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు పలు మార్పులు చేసినట్టు వివరించారు.
ప్రయాణికుడే ప్రధానం అనే కార్యక్రమంలో భాగంగా... భౌతిక దూరం పాటించేలా గుర్తులు, ఎప్పటికప్పు పరిసరాలు శానిటైజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. దీని కోసం ప్రయాణికులు సహకరించాలని కోరారు. మాస్కులు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయడం తప్పనిసరి చేస్తామన్నారు.
ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు