ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా రామతీర్థానికి కొత్త విగ్రహాలు చేరుకున్నాయి. బొడికొండపై ధ్వంసమైన కోదండి రాముని విగ్రహాల స్థానంలో ప్రతిష్ఠించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విగ్రహాలను తయారుచేసింది. తిరుపతి నుంచి రామతీర్థం చేరుకున్న ఆ విగ్రహాలకు.. పొలిమేర నుంచి మంత్రోచ్ఛారణతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
శ్రీ రాముడుతోపాటు సీతాదేవి, లక్ష్మణ విగ్రహాలకు ఈ నెల 25 నుంచి 3 రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ విగ్రహాలను 28న రామతీర్థం ప్రధాన ఆలయ కళ్యాణ మండపంలోని బాలాలయంలో ప్రతిష్ఠించనున్నారు.