chairpersons take charge: రాష్ట్రంలో తాజాగా నియామకమైన కార్పొరేషన్ల ఛైర్మన్లు పదవీబాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మెన్‌గా జూలూరి గౌరీ శంకర్.. హైదరాబాద్ రవీంద్రభారతిలోని కళాభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపిన గౌరీ శంకర్... సాహిత్య రంగాన్ని రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల విశిష్టతను పుస్తక రూపంలో తీసుకొస్తామని గౌరీశంకర్ అన్నారు.
కళాకారులకు ఉద్యోగాలిచ్చిన రాష్ట్రం..
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయాలు, కళల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అణగదొక్కబడిన వారికి స్వరాష్ట్రంలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని గుర్తుచేశారు. ఉద్యమకారులకు అవకాశాలు వస్తాయని... సమన్వయంతో ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని... అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు.
ఎలాంటి లోటు లేకుండా..
తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయల అభివృద్ధి సంస్థ... టీఎస్ ఎంఐడీసీ నూతన అధ్యక్షుడిగా ఎర్రొళ్ల శ్రీనివాస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కోఠిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిచేందుకు తనవంతు కృషి చేస్తానన్న ఎర్రొళ్ల... మెడిసిన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్పరంగా ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ముచ్చటగా మూడోసారి..
మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్లో రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్‌గా కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మూడోసారి పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం కల్పించినందుకు వాసుదేవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల శాఖ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానన్నారు. గతంలో 800 మోటారు వాహనాలను 24 కోట్ల సహాయ ఉపకరణాలను 17 వేల లబ్ధిదారులకు కార్పొరేషన్ ద్వారా అందించామన్నారు.
ఇదీ చూడండి: