National Lok Adalat: జాతీయ న్యాయ సేవా సంస్థ ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు నుంచి రాష్ట్ర, జిల్లా, తాలుకా స్థాయిలో ఈ నెల 12న లోక్‌అదాలత్ కార్యక్రమాలు జరగనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు ఈ లోక్ అదాలత్ వేదిక ద్వారా సామరస్యంగా చర్చించుకుని పరిష్కారించుకోవచ్చని రాష్ట్ర న్యాయ సేవా సంస్థ కార్యనిర్వాహక ప్రతినిధి ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.
'హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాల్లో పెద్ద ఎత్తున ఈ నెల 12న జాతీయ లోక్‌అదాలత్ జరగనుంది. ఈ లోక్‌అదాలత్‌లో పరస్పరం కక్షిదారులు అంగీకారంతో రాజీపడి తమ దీర్ఘకాల సమస్యలకు సత్వరమే స్నేహపూర్వకమైన సామరస్య పరిష్కారం, న్యాయం పొందవచ్చు. క్రిమినల్ కేసులకు సంబంధించి రాజీపడ్డ కేసులు మాత్రమే పరిష్కరిస్తారు. అదే సివిల్ కేసులకు సంబంధించి ఏ కేసునైనా రాజీ చేసే అవకాశం ఉంటుంది. వీటిపై తదుపరి ఎలాంటి అప్పీలు ఉండదు. 2020 డిసెంబర్ నుంచి 2021డిసెంబర్ వరకు లోక్ అదాలత్ ద్వారా 3,81,994కేసులు రాజీ అయ్యాయి. ప్రతిరోజు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. ఎక్కువ కేసులు దీనిద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోని కక్షిదారులు తమ సమీపంలో ఉన్న న్యాయ స్థానంకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. '
-ఎస్.గోవర్ధన్‌రెడ్డి, కార్యనిర్వాహక ఛైర్మన్ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ
ఇదీ చదవండి:రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: సీఎం కేసీఆర్