అసెంబ్లీ ప్రాంగణంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్షల్లో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సెన్‌కు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
లక్షణాలు ఏమి లేకపోవడంతో... అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాగా... కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆ శాసనసభ్యుడిని ఇంట్లోనే హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వం మీద భారమున్నా... నెల నెల డబ్బులిచ్చాం'