దుబ్బాక ఫలితమే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందని భాజపా కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుంత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకే పదివేల ఆర్థిక సాయం పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
తెల్లవారుజాము నుంచే ప్రజలు మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్‌ధన్ ఖాతాల్లో ఈ సొమ్ము వేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో లక్ష కోట్ల వ్యయాన్ని పెంచిన కేసీఆర్... హైదరాబాద్ డ్రైనేజీ కోసం పదివేల కోట్లు ఖర్చు చేసి ఉంటే... వరద ముంపు సంభవించేది కాదని హితవు పలికారు.