ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పాద‌యాత్ర: విజయసాయి - విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో 25 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై పాద‌యాత్ర: విజయసాయి

author img

By

Published : Feb 16, 2021, 7:12 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 25 కిలోమీటర్ల పాద‌యాత్ర చేపడుతున్నామ‌ని... వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్ర‌క‌టించారు. ప్లాంట్ ప్రైవేటీకరణను పార్లమెంటు లోపల, వెలుపల తాము వ్యతిరేకించామ‌ని చెప్పారు. 13 కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారికి సంఘీభావం తెలుపుతూ... ప్లాంట్ ఎదుట ప్రజాప్రతినిధుల ధర్నాలో పాల్గొన్నామ‌ని వివ‌రించారు. త్వ‌ర‌లోనే ముఖ్యమంత్రి జగన్ కార్మిక సంఘాలతో సమావేశమవుతార‌ని చెప్పారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఇప్పటికే ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారని.. మోదీని కలిసేందుకు అపాయింట్​మెంట్ కోరామన్నారు. ఈ నెల 20న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాటయాత్ర పేరుతో గాంధీ విగ్రహం నుంచి స్టీల్‌ప్లాంట్‌ వరకు పాదయాత్ర జరుగుతుందని ఆయన వెల్లడించారు. పాదయాత్ర అనంతరం సాయంత్రం స్టీల్ ప్లాంట్ వ‌ద్ద బహిరంగ సభ నిర్వ‌హిస్తామని చెప్పారు.

వైకాపా మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంద‌ని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంటే... చంద్రబాబు విమర్శలు చేయటం తగదని హితవు పలికారు. సీఎం విదేశీ ప్రతినిధులను కలవటం సహజమ‌న్నారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీకి లేఖ రాయాల‌ని డిమాండ్ చేశారు. తెదేపా నేతలు తమతో కలసి వస్తే తీసుకెళ్లాడానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

ఇదీ చదవండి: పల్లా శ్రీనివాస్‌ నిరాహార దీక్షను విరమింపజేసిన చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.