ETV Bharat / city

MP RRR: 'నాపై వేటు వేయించలేమని చెప్పండి.. తక్షణం రాజీనామా చేస్తా'

వైకాపా నేతలపై ఎంపీ రఘురామ విమర్శలు గుప్పించారు. తనపై అనర్హత వేటు వేయించలేమని చెబితే తక్షణం రాజీనామా చేస్తానని ఎంపీ సవాల్ విసిరారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని వెల్లడించారు.

author img

By

Published : Jan 22, 2022, 8:33 PM IST

MP RRR
MP RRR

చిరంజీవిపై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ రఘురామ అన్నారు. సినిమా టికెట్ల అంశంపై చర్చలకు పిలిస్తే వచ్చానని చిరంజీవి చెప్పారని.. కేవలం భోజనం చేయడానికి వచ్చారని పేర్ని నాని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా పేర్ని నాని ఒక వీడియో విడుదల చేశారని.. ఇందులో ఎవరిని ఉద్దేశించి వీడియోలో మాట్లాడారనేది చెప్పాలన్నారు.

తపై అనర్హత వేటు వేయించలేమని చెబితే తక్షణం రాజీనామా చేస్తానని ఎంపీ రఘురామ సవాల్ విసిరారు. తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును తమ సీఎం నిలిపివేయించారన్నారు. సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని స్పీకర్‌ను కోరానని చెప్పారు. గుడివాడ క్యాసినోతో కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పిన రఘురామ.. కొడాలి నానిని అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికే నష్టం ..

ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ విధి అన్నారు. పీఆర్సీ వివాదంపై సీఎం నిర్దేశం ప్రకారం మంత్రులు ప్రజల ముందుకెళ్తే... ప్రభుత్వానికి నష్టమన్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన.. ఈ నెల 24 నుంచే..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.