కొవిడ్ సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై దిల్లీలో ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు కేంద్రం రూ. 7000 కోట్ల నిధులు మంజూరు చేయగా... కేవలం రూ.290 కోట్లు ఇచ్చారనటం అవివేకమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ... తండ్రీకొడుకులు అబద్దాలు మానుకోవాలని హితవు పలికారు. కేవలం ఒక శాక నుంచి విడుదలైన నిధులను కూడా మొత్తం ఖర్చుపెట్టలేదని ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు తెలిపిన అర్వింద్... బాంబేలో జరుగుతున్న నార్కోటిక్ దాడులకు హైదరాబాద్‌లో కొందరు బయపడుతున్నారని పేర్కొన్నారు.
కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్
కేంద్ర నిధుల విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై ఎంపీ అర్వింద్ ఘాటుగా కౌంటరిచ్చారు. కేవలం ఒక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన నిధులను కేంద్రం మొత్తం విడుదల చేసిన వాటిగా చెప్పి... రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
కొవిడ్ సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధులపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై దిల్లీలో ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు కేంద్రం రూ. 7000 కోట్ల నిధులు మంజూరు చేయగా... కేవలం రూ.290 కోట్లు ఇచ్చారనటం అవివేకమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ... తండ్రీకొడుకులు అబద్దాలు మానుకోవాలని హితవు పలికారు. కేవలం ఒక శాక నుంచి విడుదలైన నిధులను కూడా మొత్తం ఖర్చుపెట్టలేదని ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధుల వివరాలు తెలిపిన అర్వింద్... బాంబేలో జరుగుతున్న నార్కోటిక్ దాడులకు హైదరాబాద్‌లో కొందరు బయపడుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బకాయిలు విడుదల చేయాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ