ETV Bharat / city

బండి ఆపమన్నందుకు ట్రాఫిక్​ సిబ్బందిపై దాడి... - langar house attack news

హైదరాబాద్​ లంగర్​హౌస్​లోని బాపూఘాట్ రామాలయం వద్ద ట్రాఫిక్​ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వాహనాన్ని ఆపగా... అతను ఏకంగా సిబ్బందిపైకే దూసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. ఇది చూసి మరింత మంది పోగై... పోలీసులపైనే దాడి చేశారు.

Motorist attack on traffic police at langar house

author img

By

Published : Feb 11, 2021, 8:24 PM IST

వాహనం ఆపమన్నందుకు విధుల్లో ఉన్న ట్రాఫిక్​ సిబ్బందిపై దాడి చేశాడు ఓ వాహనదారుడు. హైదరాబాద్​ లంగర్​హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూఘాట్ రామాలయం వద్ద టోలిచౌక్​ ట్రాఫిక్ సిబ్బంది సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో యాక్టివా వాహనంపై వెళ్తున్న షేక్ హాజీ పాషాను పోలీసులు ఆపమన్నారు. తను వాహనం ఆపకుండా... వేగంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రవి అనే హోంగార్డ్​పైకి వాహనాన్ని ఎక్కించి... దాడికి పాల్పడ్డాడు.

బండి ఆపమన్నందుకు ట్రాఫిక్​ సిబ్బందిపై దాడి... అరెస్ట్​

ఈ గొడవను గమనించిన మరికొందరు షేక్ హాజీ పాషా మిత్రులు కూడా... పోలీసులపై దాడికి తెగబడ్డారు. ఇష్టం వచ్చినట్టు రవిపై దాడి చేశారు. ఇది గమనించిన తోటి ట్రాఫిక్ పోలీసులు ఆపడానికి ప్రయత్నించినా... సాధ్యం కాలేదు. వెంటనే లంగర్ హౌస్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: శెభాష్‌ పోలీస్‌.. వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.