ETV Bharat / city

నిరసనకు దిగిన వైద్య విద్యార్థులు.. సీట్లు సర్దుబాటు చేయాలని డిమాండ్​

Medical Students Protest: హైదరాబాద్​లోని కోటీ డీఎంఈ కార్యాలయ ఆవరణలో ఎంఎన్​ఆర్ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. తమ సీట్లు రద్దై నెల గడుస్తున్నా.. ఇప్పటి వరకు యూనివర్సిటీ యాజమాన్యం తమకు వేరే చోట సర్దుబాటు చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు సీట్లు సర్దుబాటు​ చేయాలని డిమాండ్​ చేశారు.

MNR Medical collage Students Protest for seats reallocation in koti

author img

By

Published : Jun 8, 2022, 6:45 PM IST

నిరసనకు దిగిన వైద్య విద్యార్థులు.. సీట్లు రీఅలొకేట్​ చేయాలని డిమాండ్​..

Medical Students Protest: ఇటీవల రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలను రద్దు చేస్తూ... నేషనల్ మెడికల్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎంఎన్​ఆర్ వైద్య కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గత నెలలోనే తమ సీట్లను రద్దు చేసినట్టు ఎన్​ఎంసీ అధికారికంగా ప్రకటించినా.. ఇప్పటి వరకు తమకు వేరే చోట సర్దుబాటు చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కోటీ డీఎంఈ కార్యాలయ ఆవరణలో ధర్నా చేసిన విద్యార్థులు.. ప్రభుత్వం తమకు సీట్లు కేటాయించాలని అందుకు సంంధించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీట్ల సర్దుబాటు​కి సంబంధించిన కాళోజీ వర్సిటీ అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా ఎలాంటి స్ఫందనలేదన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఇలాంటి పరిస్థితే ఎదురైన విషయాన్ని గుర్తు చేసిన విద్యార్థులు.. రద్దయిన సీట్లు తిరిగి రావటం ఇప్పటివరకు జరగలేదని వ్యాఖ్యానించారు.

"మా సీట్లు రద్దయినట్టు మే 19న ఎంఎన్సీ అధికారిక వెబ్​సైట్​లో పెట్టింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాకు 28న తెలిసింది. 19 నుంచి 28 వరకు మా కాలేజీ గానీ.. యూనివర్సిటీ గానీ.. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 29న మా ప్రిన్సిపల్​ని అడిగితే.. ఆ సమాచారం సరైంది కాదన్నట్టు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ.. మా సీట్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఈరోజు ఇలా ధర్నా చేయాల్సివస్తోంది. సీట్లు రద్దయితే వేరే కళాశాలలో సర్ధుబాటు చేయాలని ఎంఎన్సీ గైడ్​లైన్స్​ చెబుతున్నాయి. అయినప్పటికీ యూనివర్సిటీ గానీ.. ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆలస్యమైనాకొద్దీ.. మా అకాడమిక్​ ఇయర్​ వేస్ట్​ అవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సీట్లు సర్దుబాటు​ చేయాలని కోరుతున్నాం." - వైద్య కళాశాల విద్యార్థులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.