సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి... నేడు మజ్లీస్ పార్టీకి తలొగ్గి విమోచన దినాన్ని నిర్వహించటం లేదని ఆరోపించారు.
పోలీస్ ఎస్కార్ట్‌తో కౌన్సిల్‌కు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావును పోలీసులు తమ ఎస్కార్ట్‌తో కౌన్సిల్‌కు పంపించారు. అసెంబ్లీ ముట్టడికి పార్టీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో భాజపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.
mlc ramachanderrao went to council with police escort
భాజపా చేపట్టిన అసెంబ్లీ ముట్టడి దృష్ట్యా హైదరాబాద్ తార్నాకలోని పార్టీ నగర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. కౌన్సిల్ సమావేశాలు ఉన్నందున ఆయనను పోలీస్ ఎస్కార్ట్‌తో మండలికి పంపించారు. రాంచందర్‌రావుతో పాటు ఉన్న పలువురు నాయకులను అరెస్ట్ చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి... నేడు మజ్లీస్ పార్టీకి తలొగ్గి విమోచన దినాన్ని నిర్వహించటం లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి: ప్రశ్నోత్తరాల తర్వాత రెవెన్యూ బిల్లులపై చర్చ