MLA KETHIREDDY: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 'జలకళ' బోరుబావుల తవ్వకం పథకంపై.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేటలో నిర్వహించిన 'గుడ్ మార్నింగ్' కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మల్లీశ్వరీ అనే ఓ మహిళా రైతు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 'జలకళ' బోరు వేశారని.. కానీ, ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని అడిగారు.
దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. జలకళ పథకం కింద ఎంతమందికి బోర్లు వేయాలి..? ఎంత లోతు వేయాలి? అనేది మాకు కూడా అర్థం కాలేదని ఆయన అన్నారు. అసలు ఈ పథకమే తప్పని.. ఒకరికి వేసి ఒకరికి వేయలేని దుస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించారు. ఆయన మాటలతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
ఇవీ చదవండి..:
'తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.80లకే ఇవ్వొచ్చు'
కట్టుకున్నది కన్నుమూసినా.. కాటికి పంపలేని దీనావస్థ.. ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ