ఓ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఐడల్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం యువతి షణ్ముఖప్రియ చూపుతున్న ప్రతిభకు మిస్ ఇండియా రన్నరప్ మాన్యా సింగ్ ప్రశంసలు జల్లు కురిపించారు. తాను షణ్ముఖప్రియ అభిమానినంటూ వ్యాఖ్యానించారు. ‘ఇండియా కి ఫర్మాయిష్’ పేరిట ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో గాయకుల తరఫున వారి అభిమానులు పాల్గొనే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమానికి షణ్ముఖప్రియ అభిమానిగా మాన్యా సింగ్ హాజరయ్యారు. తాను కష్టపడి మిస్ ఇండియా రన్నరప్ స్థాయికి రాగలిగానని, షణ్ముఖ ప్రియ కూడా చాలా కష్టపడి ఎదిగిందని తెలిసిందని.. తామిద్దరిదీ ఒకే తరహా ప్రస్థానమని పేర్కొన్నారు. భారత రాక్ స్టార్‌గా రాణించాలని పేర్కొన్నారు. బహుమతి కూడా తెచ్చానంటూ ఒక కిరీటాన్ని అలంకరించారు.
ఇదీ చూడండి: కాళేశ్వరం విస్తరణ పనులపై మేం ఆదేశాలివ్వలేం : సుప్రీం