ETV Bharat / city

మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు చేయడం తగదు: తలసాని - అమీర్​పేట్​ డివిజన్

విపక్షాలు విమర్శలు గుప్పించడం మానుకొని ప్రజా సంక్షేమం కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ హితవు పలికారు. గ్రేటర్​ ఎన్నికల దృష్ట్యా అమీర్​పేట్​ డివిజన్​లో ఆయన పర్యటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

minister thalasani campaign in ameerpet
మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు చేయడం తగదు: తలసాని
author img

By

Published : Nov 24, 2020, 4:38 PM IST

ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించడం మానుకొని ప్రజా సంక్షేమం కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక అమీర్​పేట్​ డివిజన్​లోని బాపు నగర్​లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విపక్ష నాయకులు ఓట్ల కోసం అర్థంలేని విమర్శలు చేయడం సమంజసం కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

మేనిఫెస్టోపై విపక్షాలు విమర్శలు చేయడం తగదు: తలసాని

అనవసరమైన రాద్ధాంతం వద్దు

ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టోపై అనవసరమైన రాద్ధాంతం చేయడం తప్ప ప్రతిపక్ష నాయకులు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి మంత్రి అయినా కూడా హైదరాబాద్​కి గాని రాష్ట్రానికి గాని ఏ మంచి చేయలేదని ఆరోపించారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: ఐదేళ్లలో తెరాస ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.