విజయ డైరీ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి మరిన్ని విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో విజయ డైరీ ఉత్పత్తులు వినియోగించేందుకు ఆదేశాలు ఇచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. బేగంపేటలోని హరితప్లాజాలో జరిగిన విజయ డైరీ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 500 ఔట్లెట్లను ఏర్పాటు చేయనున్నారు. సమ్మక్క, సారలమ్మ జాతరలో 150 సంచార వాహనాల ద్వారా విజయ ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండిః కులవృత్తిదారుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి తలసాని