ETV Bharat / city

నిమ్స్​లో రోగులకు మంత్రుల మనోధైర్యం - మంత్రుల నిమ్స్‌ ఆస్పత్రి సందర్శన

నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరామర్శించారు. ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఇరువురు మంత్రులు ట్రామా భవనంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి... మనోధైర్యాన్నిచ్చారు.

minister talasani and muhammad ali visited nims hospital

author img

By

Published : May 25, 2021, 12:19 PM IST

గాంధీ, ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగుల్లో మనోధైర్యం నింపిన సీఎం కేసీఆర్​ బాటలోనే మంత్రులు కూడా​ పయనిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిని మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సందర్శించారు. ఆస్పత్రిలోని ట్రామా భవనంలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రులు పరామర్శించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్యపరిస్థితిని, అందుతున్న వైద్యసేవలను మంత్రులు తెలుసుకున్నారు.

వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మందులు, ఆక్సిజన్​ సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో నిమ్స్ సంచాలకులు మనోహర్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకట్​తో పాటు వైద్యులు మంత్రుల వెంట ఉన్నారు.

నిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని

ఇదీ చూడండి: ఐసీఎంఆర్ సూచనలు: ఇలా తాకండి.. అలా తినండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.