తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ నిర్వహణపై సచివాలయంలో మంత్రి ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 9 రోజులపాటు రాష్ట్రంలో వైభవంగా జరపాలని మంత్రి అధికారులను కోరారు. అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: కేటీఆర్