హైదరాబాద్ నుంచి మేడారానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సర్వీస్‌ను బేగంపేట్ ఎయిర్ పోర్టులో ప్రారంభించారు. జాతర ముగిసే వరకు ఈ సేవలు కొనసాగించనున్నట్లు మంత్రి తెలిపారు. హెలికాప్టర్లో ఆరుగురి ప్రయాణానికి లక్షా 80 వేల రూపాయలతో పాటు జీఎస్టీ ఛార్జీలు వేయనున్నట్లు చెప్పారు.
వీఐపీ దర్శనం
ఈ ప్యాకేజీలో భాగంగా సమ్మక్క సారలమ్మ వీఐపీ దర్శనం కల్పించనున్నారు. మేడారం జాతర దగ్గర విహంగ వీక్షణం చేసేందుకు రూ.2999 ఛార్జీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ప్రపంచానికి చూపిస్తామని... ఇప్పటికే రామప్ప యునెస్కో బృందం పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. హెలికాప్టర్ సేవలకు 9400399999 నెంబరును సంప్రదించాలని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: భార్యను చంపి జాతీయ గీతం పాడిన భర్త!