ETV Bharat / city

తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు: సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచాలని భావిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నామని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు నేపథ్యంలో గుజరాత్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మంత్రి సందర్శించారు.

తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు: సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి
తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు: సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Jul 31, 2021, 10:38 PM IST

తెలంగాణ అంతటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్ కాంఠ జిల్లా ఓరన్‌లో దేవస్య న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ వేరు శనగ ఆధారిత పీనట్ బట్టర్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను మంత్రి సందర్శించారు. గుజరాత్ తర్వాత వేరుశనగకు తెలంగాణ రాష్ట్రం ప్రసిద్ది అని.. గుజరాత్‌లో వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అధికంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తి అవుతుందని... క్యాన్సర్ కారక ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ ఉత్పత్తులకు అంతర్జాతీయ డిమాండ్ ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచాలని భావిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల వారీ పంటల ఆధారంగా యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. వ్యవసాయ అనుబంధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతు పండించిన పంటలకు లాభసాటి ధర అందించేందుకు కృషి చేయడమే కాకుండా సాంప్రదాయ పంటల సాగు నుంచి అన్నదాతలు బయటకు రావాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో అగ్రీ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇవి చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.