కృష్ణాజలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని... మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు తరలించుకుపోతుంటే కావలి కాసిన వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనను ఇప్పటికే పలు వేదికలపై వినిపించామన్న ఆయన... వాళ్లు కావాలన్నప్పుడే వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అంత సులువు కాదని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయన్న మంత్రి... కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే మొత్తం పూర్తయ్యేదని వెల్లడించారు.
ఇవీచూడండి: పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్