ఇటీవల అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న నాగులు కుటుంబానికి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆర్జీకే కాలనీ దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన నాగులు అసెంబ్లీ, మండలి సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒంటి మీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
మంత్రి మల్లారెడ్డి... నాగులు కుటుంబాన్ని పరామర్శించారు. సొంతంగా... రెండు లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి అందించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నాగులు కుటుంబానికి మంత్రి భరోసానిచ్చారు.