ETV Bharat / city

MALLAREDDY: 'ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో!' - తెలంగాణ రాజకీయాలు

టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. అంతేకాకుండా రేవంత్​కు సవాల్ విసిరారు. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో.. అంటూ మంత్రి మల్లారెడ్డి సవాల్ చేశారు.

minister-mallareddy-fires-on-tpcc-chief-revanth-reddy

author img

By

Published : Aug 25, 2021, 7:13 PM IST

Updated : Aug 25, 2021, 7:27 PM IST

MALLAREDDY: ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో!

మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే ప్రకటించిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని.. అందులో అసైన్డ్‌, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.

రేవంత్‌.. రాజీనామాకు సిద్ధమా?

‘‘ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్‌ సవాల్‌ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తాను. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్‌ పీసీసీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అని రేవంత్‌రెడ్డికి మల్లారెడ్డి సవాల్‌ విసిరారు.

ఇవీచూడండి: REVANTH REDDY: చర్చకు నేను సిద్ధం.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: రేవంత్​రెడ్డి

Last Updated : Aug 25, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.