KTR Tweet Today: మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో ట్విటర్ వేదికగా కమలనాథులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల అమిత్‌షాకు బండి సంజయ్ చెప్పులు అందించిన సన్నివేశాన్ని గుర్తుచేస్తూ.. ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఊహిస్తున్నారు. అంతేనా.. పాప్ క్విజ్ కూడా నిర్వహించారు.
-
Pop quiz:
— KTR (@KTRTRS) August 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiS
">Pop quiz:
— KTR (@KTRTRS) August 27, 2022
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiSPop quiz:
— KTR (@KTRTRS) August 27, 2022
Which Ghulam will carry the Chappal of JP Nadda today?
Am sure there is intense competition 😁 pic.twitter.com/Tz8YiCYIiS
KTR on JP Nadda Hanamkonda Tour : "ఈసారి జేపీ నడ్డా చెప్పులు మోసే గులామ్ ఎవరు..?" అంటూ ట్విటర్లో ప్రశ్న ఎక్కుపెట్టారు. "ఈసారి కచ్చితంగా తీవ్రమైన పోటీ ఉంటుంది" అనే వ్యాఖ్యను కూడా కేటీఆర్ జోడించారు. దీనికి తోడు ఓ దినపత్రిక ప్రచురించిన కార్టూన్నూ మంత్రి జతచేశారు. ఈరోజు హనుమకొండ సభకు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌ను తెరాస శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నాయి.
ఇటీవల భాజపా నిర్వహించిన మునుగోడు సభకు హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లోని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో అమిత్‌షాకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు అందివ్వటం తెగవైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు హన్మకొండలో నిర్వహిస్తోన్న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కోసం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. నడ్డా కూడా భద్రకాళి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.