దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఇంత ఘనత సాధించటానికి కారణం సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి ఉద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేసినా... వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని తెలిపారు.
హైదరాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని తిప్పికొడుతూ... దేశంలో నంబర్ వన్ సేఫెస్ట్ సిటీగా పేరుతెచ్చుకున్నామని గుర్తుచేశారు. ఎక్కడా గిల్లిగజ్జాలు.. పంచాయితీలకు తావులేకుండా ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరున్నరేళ్లు బాధ్యతాయుతంగా పనిచేశామని కేటీఆర్ తెలిపారు.