ETV Bharat / city

దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్​: కేటీఆర్​

రాష్ట్ర అభివృద్ధికి ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ నినాదంతో ముందుకెళ్తున్నామని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో దేశ ఫార్మా కాపిటల్​గా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు.

minister ktr inaugurated bio Asia 17 edition summit in Hyderabad
దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్​: కేటీఆర్​
author img

By

Published : Feb 17, 2020, 8:51 PM IST

Updated : Feb 17, 2020, 11:04 PM IST

లైఫ్ సైన్సెస్ రంగంలో దేశ ఫార్మా కాపిటల్​గా హైదరాబాద్ ఎదుగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్​ఐసీసీలో 17వ ఎడిషన్ బయో ఆసియా సదస్సును ప్రారంభించారు. దేశంలో సింహ భాగం మందులు, వ్యాక్సిన్​లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి జరగటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

హైదరాబాద్ గ్రోత్ హిస్టరీలో ఫార్మా రంగం కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే మెడికల్ డివైస్ పార్క్​లో 20 ఫార్మా కంపెనీలు పని ప్రారంభించాయని తెలిపారు. త్వరలో హైదరాబాద్ ఫార్మా సిటీ, బీ.హబ్ (బయోటెక్)ను ప్రారంభించుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ట్రిపుల్​ ఐ నినాదంతో(ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌) నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో 37 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు, పలు ఫార్మా కంపెనీల సీఈవో లు, లైఫ్ సైన్సెస్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్​: కేటీఆర్​

ఇవీచూడండి: గేమింగ్ అడ్డాగా హైదరాబాద్​: జయేష్ రంజన్

Last Updated : Feb 17, 2020, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.