ETV Bharat / city

'జీరో అవర్​లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అధ్యక్షా..!'

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసే సమయంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్​గోపాల్​రెడ్డికి మంత్రి కేటీఆర్​కు మధ్య కౌంటర్​, ఎన్​కౌంటర్​ జరిగింది. కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సభలో వాస్తవాలు మాట్లాడాలని రాజ్​గోపాల్​కి మంత్రి సూచించారు.

minister ktr encounter to komatireddy rajgopal reddy counter

author img

By

Published : Sep 10, 2020, 2:14 PM IST

Updated : Sep 10, 2020, 4:09 PM IST

'జీరో అవర్​లో హీరోగిరి చేస్తానంటే ఎట్లా అద్యక్షా..!'

రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా... తమ నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధులు రావటంలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆరోపించారు. తమకు సిరిసిల్ల, సిద్దిపేట లాంటి పట్టణాలు కావాలని లేదని... రూ.100 కోట్ల బడ్జెట్​ కావాలని కోరుకోవటం లేదని... ప్రభుత్వం తమ నియోజకవర్గాన్ని ఓ సారి చూడాలని కోమటిరెడ్డి కౌంటర్​ వేశారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తాము ఏమీ చేయకపోతే... 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే... 122 ఛైర్మన్​ పదవులు తెరాసకు ఎలా వస్తాయని కోమటిరెడ్డిని మంత్రి కేటీఆర్​ తిరిగి ప్రశ్నించారు. సత్యదూరమైన మాటలు మానేసి... నిజాలు మాట్లాడాలని మంత్రి కోరారు. జీరో అవర్​లో హీరోగిరి చేస్తే మంచిది కాదంటూ... తనదైన శైలిలో కేటీఆర్​ సమాధానమిచ్చారు.

ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణకు హాజరైన దేవరాజ్

Last Updated : Sep 10, 2020, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.