ETV Bharat / city

'విశేష సేవలందిస్తున్న సంస్థలను దత్తత తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం'

Minister Koppula Eshwar: సంక్షేమం, అభివృద్ధి అంశాలలో రాష్ట్రం దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దివ్యాంగులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, భద్రత, అభ్యున్నతికి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్​లో నిర్వహించిన దివ్యాంగుల సలహా మండలి మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశానికి మంత్రి హాజరయ్యారు.

Koppula Eshwar
కొప్పుల ఈశ్వర్‌
author img

By

Published : Mar 17, 2022, 10:47 PM IST

Minister Koppula Eshwar: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమ రంగంలో ముందుకు వెళుతుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దివ్యాంగుల సలహా మండలి మొట్టమొదటి రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్‌ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.

'సంక్షేమం, అభివృద్ధి అంశాలలో రాష్ట్రం దేశం మొత్తానికి ఆదర్శంగా మారింది. దివ్యాంగుల సంక్షేమానికి ప్రతి ఏటా 64 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు 3వేల16 రూపాయల చొప్పున ప్రతినెల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే గొప్ప మానవతామూర్తి కేసీఆర్. దివ్యాంగులకు విశేష సేవలందిస్తున్న సంస్థలను దత్తత తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న అత్యుత్తమ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. సీఎం దృష్టికి తీసుకెళ్లి మరింత మేలు జరిగేలా చూస్తాం.'

- కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర మంత్రి

ఈ కార్యక్రమానికి దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ డా.వాసుదేవరెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్, దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ శైలజ, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:BJP Deeksha: 'అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలపైకి బుల్డోజర్లను పంపిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.