దివ్యాంగుల కోసం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకు పారదర్శకంగా నూటికి నూరు శాతం సబ్సిడీలు ఇస్తూ ముందుకు వెళుతున్నట్టు మంత్రి తెలిపారు. దివ్యాంగులు వారికి కావాల్సిన పరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు అందజేయటం ఏ రాష్ట్రంలోనూ లేదని మంత్రి పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 100 శాతం సబ్సీడితో ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని... రాష్ట్ర దివ్యాంగ కార్పొరేషన్ ఛైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: 'నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు తక్షణ చర్యలు'