ప్రజలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గ అమ్మవారు అందరికీ మంచి ఆరోగ్యం, సంపదలు చేకూర్చాలని కోరుకున్నారు. ప్రతి ఏడాది అంబర్పేటలో జరుపుకునే బతుకమ్మ ఉత్సవాల కోసం ఎంతగానో ఎదురుచూసే ముఖ్య కార్యక్రమమన్నారు.
కొవిడ్ మహామ్మారి వల్ల ఈ ఏడాది అంబర్‌పేట మైదానంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడంలేదని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. భగవంతుని దయతో వచ్చే ఏడాది ఆరోగ్యకర వాతావరణంలో రంగురంగుల పువ్వుల మధ్య బతుకమ్మ, దసరా ఉత్సవాలను జరుపుకుందామని ఆశించారు.