ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. వాటితో అధైర్య పడొద్దని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో ఓడిపోయామని కుంగిపోవద్దని.. పార్టీ అండగా ఉంటుందని భాజపా నేత శ్రీనివాస్‌గౌడ్‌కు భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ బోరబండ డివిజన్ నుంచి భాజపా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్‌గౌడ్ ఇంటికి మంత్రి వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్నికల్లో గెలుపోటములు పట్టించుకోకుండా, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి: సామాన్యులకు షాక్- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర