Jagadeesh reddy comments: రైతులను కేసీఆర్ నుంచి దూరం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి దిల్లీలో ఆరోపించారు. వానాకాలంలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగేందుకే దిల్లీలో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్న మంత్రి.. దాదాపు కోటి టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందన్నారు. కానీ.. కేంద్రం కేవలం 60 లక్షల టన్నుల ధాన్యమే తీసుకుంటానని చెప్పిందని గుర్తుచేశారు. ధాన్యం కొంటారో లేదో కేంద్రమంత్రి చెప్పకుండా పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
సమాధానం చెప్పకుండా తిట్టిస్తున్నారు..
"కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిలో వెళ్తోంది. రైతులను కేసీఆర్ నుంచి దూరం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోంది. ఆరేళ్లలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. ఈ వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు కోటి టన్నుల ధాన్యం దిగుబడైంది. కేంద్రం మాత్రం 60 లక్షల టన్నుల ధాన్యమే తీసుకుంటానని చెప్పింది. రాష్ట్రం నుంచి బియ్యాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదే. వానాకాలంలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగేందుకే దిల్లీలో ఉన్నాం. ధాన్యం కొంటారో లేదో కేంద్రమంత్రి చెప్పటం లేదు. అడిగిందానికి స్పష్టమైన సమాధానం చెప్పకుండా.. పార్టీ నేతలతో తిట్టిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్ కూడా భాజపాకు వంతపాడుతోంది." - జగదీశ్‌రెడ్డి, మంత్రి
ఇదీ చూడండి: